ఔను నా కాళ్లు కూడా వణుకుతున్నాయి

అమరావతి: టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు తనయుడు నారా లోకేశ్‌పై నగరి ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్‌పర్సన్‌ ఆర్కే రోజా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 'టీడీపీ నేతలు ఉదయాన్నే లేచి నారా లోకేశ్‌తో ప్రెస్‌మీట్ పెట్టించారు. ఆయన ప్రెస్‌మీట్‌ చూస్తే మంత్రుల కాళ్లు వణుకుతున్నాయంటున్నారు. ఔను నా కాళ్లు కూడా వణుకుతున్నాయి' అంటూ ఆమె ఎద్దేవా చేశారు.










అసెంబ్లీలోని మీడియా లాబీ వద్ద బుధవారం ఎమ్మెల్యే రోజా  విలేకరులతో చిట్‌చాట్‌ చేశారు. మంగళగిరి అని పలకడానికి నారా లోకేశ్‌ ట్యూషన్ పెట్టించుకున్నారని విమర్శించారు. అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణను మాట్లాడనివ్వడం లేదని,  చంద్రబాబునాయుడు కళాకారులకు అన్యాయం చేస్తున్నారని రోజా తప్పుబట్టారు. శ్రీకాకుళం ప్రాజెక్టుల గురించి మాట్లాడకుండా.. రాయలసీమ ప్రాజెక్టుల గురించి అచ్చెన్నాయుడు మాట్లాడుతున్నారని సొంత పార్టీ శ్రీకాకుళం జిల్లా ఎమ్మెల్యేలే ఎద్దేవా చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు.